సాయి దుర్గతేజ్ SYG (సంబరాల ఏటిగట్టు) నుంచి రగ్గడ్ ఇంటెన్స్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా SYG (సంబరాల యేటిగట్టు) నుంచి సంక్రాంతి సందర్భంగా అద్భుతమైన కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన బ్యానర్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో సాయి దుర్గతేజ్ రస్టిక్ అవాతర్ అదరగొట్టారు.  

పోస్టర్ సాయి తేజ్‌ ను విలేజ్ లుక్‌లో ప్రజెంట్ చేస్తోంది. బూడిద రంగు చొక్కా, సాంప్రదాయ పంచె కట్టు ధరించి, గ్రామీణ నేపథ్యంలో చెప్పులు లేకుండా నడుస్తూ,  తెల్లటి ఎద్దును సున్నితంగా నడిపిస్తున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. గుబురు గడ్డం, తీక్షణమైన చూపు, చిరునవ్వు ఈ మూడు కలిసి ఆయన లుక్‌ అదిరిపోయింది.

ఈ పాత్ర కోసం సాయి దుర్గ తేజ్ కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. చిత్రంలో ఇప్పటివరకూ ఎన్నడూ చూడని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, భావోద్వేగాలతో నిండిన విజువల్స్‌  ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చాయి.

వెట్రి పళనిసామి అద్భుతమన సినిమాటోగ్రఫీ, బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నత స్థాయి నిర్మాణ విలువలతో, SYG  గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Related Articles

Latest Articles