ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అనౌన్స్ మెంట్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి ఫిలింమేకర్ గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా యామినీ ఈఆర్ తో హీరోయిన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90’s హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.

ఈ సినిమా పోస్టర్ ను ఇటీవల సంక్రాంతి పండుగ విశెస్ తో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ సిస్టమ్, సొసైటీలో జరిగే ప్రేమ కథతో మూవీ రూపొందుతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడైంది. పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టెక్నికల్ టీమ్ ను త్వరలోప్రకటించనున్నారు.

నటీనటులు – యామినీ ఈఆర్, కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్, తదితరులు

Related Articles

Latest Articles