విశాల్ ‘మొగుడు’ గ్లింప్స్ రిలీజ్

తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు సుందర్ సి. అవ్ని సినీమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కుష్బూ సుందర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు A.C.S అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొగుడు అనే టైటిల్ తో రాబోతున్న చిత్రంలో విశాల్‌ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. కమెడియన్ యోగిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మరోవైపు ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మొగుడు టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఏకంగా 5 నిమిషాల నిడివితో ఈ వీడియో కట్ చేసి ఒక్కసారిగా సినిమాపై హైప్ తీసుకొచ్చారు. ఇందులో విశాల్- తమన్నాలను భార్యాభర్తలుగా చూపిస్తూనే సినిమాలో డెప్త్ ఏంటనేది క్లియర్ గా చెప్పేశారు మేకర్స్. ఇందులో యోగి బాబు రోల్ మరో హైలైట్ అని చెప్పుకోవాలి. తాజాగా వదిలిన ఈ వీడియో కేవలం ఈ మూడు పాత్రలే చూపించి అంచనాలు క్రియేట్ చేశారు డైరెక్టర్ సుందర్ C.

”ఇలా చూడండి.. మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా” అంటూ యోగిబాబు చెప్పిన సీరియల్ క్లిపింగ్ చూపిస్తూ మొగుడు గ్లింప్స్ మొదలుపెట్టారు. ఆ తర్వాత తమన్నా ఇంటికి యోగిబాబు రావడం, ఆమె అందానికి ఫిదా కావడం.. చివరకు తమన్నా మొగుడు విశాల్‌ని చూసి బిత్తరపోవడం లాంటి సీన్స్ ఆసక్తికరంగా చూపించారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలుగా విశాల్- తమన్నా అదరగొట్టారనే చెప్పుకోవాలి. భర్తకు ఆర్డర్స్ వేసే భార్యగా తమన్నా, ఇంట్లో వంట పనులు చేస్తూనే శత్రువుల తాట తీసే భర్తగా విశాల్ భలే కిక్కిచ్చారు. ఈ వీడియో చూస్తుంటే మొగుడు మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్ కి రప్పించే కమర్షియల్ టచ్ ఉన్న సినిమా అని తెలుస్తోంది.

విశాల్‌ 36వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఒకవైపు కామెడీ మరోవైపు యాక్షన్ సమపాళ్లలో ఉంటుందని మాత్రం తాజా గ్లింప్స్ స్పష్టం చేసింది. అంతేకాదు గ్లింప్స్ వీడియోనే ఈ రేంజ్ లో ఉందంటే ఇక టీజర్, ట్రైలర్ ఎలా ఉండబోతుందా అనే క్యూరియాసిటీ అయితే ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాకు బెస్ట్ ప్రమోషన్స్ చేస్తూ షూటింగ్ చేస్తూనే అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తామని చిత్రయూనిట్ చెబుతోంది.

నటీనటులు : విశాల్, తమన్నా భాటియా, యోగిబాబు

డైరెక్టర్: సుందర్ C
ప్రొడ్యూసర్: A.C.S అరుణ్ కుమార్
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్: N. మణివణ్ణన్
బ్యానర్స్: అవ్ని సినీమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: హిప్ హాఫ్ తమీజా
DOP: గోపి అమర్‌నాథ్
ఎడిటర్: రోగర్
PRO: సాయి సతీష్

Related Articles

Latest Articles