
కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దేవర. ఈ చిత్రం రెండు పార్టీలుగా ప్రేక్షకులు ముందుకు రానుందని ముందు నుండి అందరికీ తెలిసిన విషయమే అయితే మొదటి భాగానికి అనుకున్నంత ఆదరణ రాకపోవడంతో రెండవ భాగం ఉండకపోవచ్చని అభిమానులు ఎంతో ఆదరణ చెందారు. అయితే అటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని గతంలోనే ఈ చిత్రం యూనిట్ దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని వెల్లడించారు. ఇటీవలే ఒక సందర్భంగా ఈ చిత్ర నిర్మాత సుధాకర్ మక్కిలినేని ఇటీవల మరొకసారి కన్ఫామ్ చేశారు. ఈ చిత్రం గురించి యాంకర్ ప్రశ్నించగా దేవర 2 షూటింగ్ మే నుండి మొదలవుతుందని, వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని ఆయన సమాధానం ఇచ్చారు. అంతేకాక దేవర 2 చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఎంతో ఆనందం పొందారు.


