‘దేవగుడి’ చిత్ర రివ్యూ

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా రఘు కుంచె, రాజశ్రీ నాయర్, రఘు బాబు, రాకెట్ రాఘవ, అన్నపూర్ణ, జబర్దస్త్ ఎమ్మానేల్, మీసాల లక్ష్మణ్, సురభి పార్వతి పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా తీసుకుని ఒక పెద్ద కుటుంబంలో, ఆ గ్రామంలో జరిగే కొన్ని సంఘటనల మధ్య జరిగిన కథగా చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రాంతంలో ఒక పెద్ద ఫ్యాక్షన్ కుటుంబంలోని కొడుకు, కూతురు అలాగే వారితో పాటు కలిసి పెరిగిన వారి డ్రైవర్ కొడుకు కలిసి పెరుగుతారు. అక్కడ ఫ్యాక్షన్ గొడవలు, సామాజిక వర్గ పట్టింపులు అధికంగా వారి జీవితాలపైన ఉంటుంది. ఇది ఇలా ఉండగా డ్రైవర్ కొడుకుతో ఆ పెద్దింటి అమ్మాయి ప్రేమలో పడుతుంది. సామాజిక పరిస్థితుల వల్ల వారి ప్రేమ విడిపోతుందా లేదా అర్థం చేసుకుని వారి ప్రేమను పెద్ద వారు అంగీకరిస్తారా? అక్కడ ఫ్యాక్షన్ పరిస్థితుల వల్ల వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి? వాటి వల్ల వారి కుటుంబాలలో, గ్రామాలలో వచ్చే మార్పులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో ప్రేక్షకులకు కనిపించిన అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ఈ సినిమాతో తొలిసారి వెండి తెరపై కనిపిస్తున్నప్పటికీ ఈ చిత్రంలో వారు నటించిన నటన, చేసిన పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా కొత్త వారిలా అనిపించదు. వారి ఎక్స్ప్రెషన్, వారి నటన, ఎమోషన్ వంటి అన్ని కోణాలలో పీక్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాత్ర రఘు కుంచె గురించి. గతంలో ఎన్నడు చేయని పాత్రను ఈ చిత్రంలో ఆయన చేశారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో ఆయన ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. అదేవిధంగా చిత్రంలో ఇతర పాత్రలో నటించిన నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
ఈ చిత్రం నుండి ముందుగా చెప్పుకోవాల్సింది కథ. యదార్థ సంఘటనలను ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఒక సందేశాత్మక రూపంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చేయడం ఎంతో క్లిష్టమైన పని. అటువంటిది ఈ చిత్ర రచన దర్శకులు ఎంతో జాగ్రత్తతో ఈ కథను రచించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చాలా పర్ఫెక్ట్ గా వెండి తెరపై చూపించారు. స్క్రీన్ ప్లే నిదానంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాలో మునిగిపోయి సమయాన్ని కూడా పట్టించుకోనంత అద్భుతంగా సినిమా ఉంది. ఫైట్స్ ఇంకా లొకేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. సినిమాలో మరొక ప్లస్ పాయింట్ సంగీతం ఇంకా పాటలు. అంతేకాక ఇతర సాంకేతిక విషయాలలో కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, సంగీతం.

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే నిదానంగా ఉండటం, కొత్త నటీనటులు.

సారాంశం :
సామాజిక విలువలు తర్వాత తరాలకు తెలిసే విధంగా, ప్రేమ, స్నేహబంధం వంటి విలువలు మరింత అద్భుతంగా చూపిస్తూ అటు కమర్షియల్ గా ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులను అలరించే చిత్రం దేవగుడి.

Related Articles

Latest Articles