ఈవెంట్ మధ్యలో వచ్చేసి ఉండాల్సింది – జె.డి.చక్రవర్తి

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన మాట్లాడుతూ… “సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో… ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, “భాష”లతో కాదని నేను బలంగా నమ్ముతాను” అని జె.డి.చక్రవర్తి అన్నారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సైతం విడుదల చేశారు.

Related Articles

Latest Articles