
సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ‘ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్’గా నిలిచింది.
చిరంజీవి మరియు దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎమోషన్స్ మరియు చిరు స్క్రీన్ ప్రెజెన్స్ కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. బుక్ మై షోలో అత్యధిక టికెట్ అమ్మకాలతో రీజినల్ బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో $3.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది.
విక్టరీ వెంకటేష్ కూడా ఈ చిత్రంలో భాగమవ్వడం సినిమా విజయానికి మరింత ఊపునిచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 400 కోట్ల భారీ మైలురాయిని చేరే దిశగా దూసుకుపోతోంది.


