‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ రివ్యూ


ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా, ఇటీవలి కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ కథ రుద్రారం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో కుల, వర్గ సమస్యల వల్ల రెండు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వేర్వేరు వర్గాలకు చెందిన చందు (చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరని తెలిసి ఈ జంట కేరళకు పారిపోతుంది. అక్కడ కూడా సమస్యలు ఎదురవడంతో, తిరిగి సొంత ఊరికే వస్తారు. తమ ప్రేమను గెలిపించుకోవాలంటే ఊరిని ఏకం చేయాలని నిర్ణయించుకుంటారు. మరి వారి ప్రయత్నాలు ఫలించాయా? ఊరంతా కలిసి ఈ జంటకు పెళ్లి చేశారా? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
చంద్రహాస్‌ తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చందు పాత్రలో తన వయసుకు తగ్గట్టుగా, మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా నటించాడు. ముఖ్యంగా డ్యాన్స్, యాక్షన్, డైలాగ్ డెలివరీలో మంచి పరిణితి కనబరిచాడు. హీరోయిన్ మేఘన ముఖర్జీ తన నటనతో ఆకట్టుకోగా, అర్జున్ మరియు మీసాల లక్ష్మణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ:
దర్శకుడు సంపత్ రుద్ర పాత పాయింట్‌నే తీసుకున్నా, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్తగా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. తెలిసిన కథే అయినా, రెండున్నర గంటల పాటు బోర్ కొట్టించకుండా ఎంటర్టైనింగ్‌గా నడిపించాడు. ప్రథమార్ధంలో ఊరి పరిచయం, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ సీన్లు, ప్రేమ సన్నివేశాలు సరదాగా సాగుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ద్వితీయార్థంలో ప్రేమను గెలిపించుకునే ప్రయత్నాలు, ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. కుల, మతాలు ప్రేమకు ఎలా అడ్డుగా మారుతున్నాయనే పాయింట్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ఈ సినిమాకి ధృవన్ సంగీతం, శేఖర్ సినిమాటోగ్రఫీ ప్రధాన బలాలు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. ఇక నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లోనూ నిర్మాతలు పెట్టిన ఖర్చు కనిపిస్తుంది.
సారాంశం:

“సరదాగా అలా థియేటర్‌కు వెళ్లి యూత్ ఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీని చూడాలని అనుకునే ఆడియెన్స్‌కి బరాబర్ ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.”

Related Articles

Latest Articles