
శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి సంగీతాన్ని అందించగా అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ చేశారు. గోపి, శివకుమార్ మట్టా, కలపలత గార్లపాటి, అరుణ్, తులసి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు విడుదల కావడం జరిగింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
రాజమండ్రి పరసరా ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండే ఒక నల్ల కన్ను ఉన్న యువకుడి కథ. పేదరికంలో పుట్టి పెరిగిన అతనికి తనకు మెల్లకన్ను ఉండడంతో చిన్నప్పటినుండి ఒక భయంలో ఉంటాడు. నిరంతరం కళ్ళజోడు పెట్టుకుని తన కళ్ళను దాచేస్తాడు. అటువంటి వ్యక్తి జీవితంలో తన గ్రామంలోని మరొక అమ్మాయి రావడం జరుగుతుంది. అయితే వారి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? ఆ ప్రేమ ఎంత దూరం వెళుతుంది? ఆ గ్రామంలోని వారంతా అతని మెల్లకన్నుని ఏ విధంగా చూస్తారు? దానివల్ల అతనికి వచ్చిన కష్టం ఏంటి? చివరికి అతని మెల్లకన్ను బాగవుతుందా లేదా? అతను ప్రేమించిన అమ్మాయితో తను కలుస్తాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి ధరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటులు నటన :
ఈ చిత్రంలో హీరో పాత్ర అయిన వంశీ తుమ్మల (చిదంబరం, సాల్మన్) మెల్లకన్నుతో అద్భుతంగా నటించారు. సాధారణంగా మెల్లకన్ను పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఆ కన్ను అలా పెట్టి కూడా చాలా సాదాసీదాగా నటించిన అసాధ్యం అనే చెప్పుకోవాలి. అటువంటి అసాధ్యమైన పనిని కూడా తన నటన స్ఫూర్తితో నటించి సాధ్యం చేశారు. అదేవిధంగా ఈ సినిమాలోని ఎమోషన్స్ క్యారీ చేస్తూనే కళ్ళజోడు ఉండి కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన సంధ్య వశిష్ట హీరోయిన్గా చాలా బాగా నటించారు. అటు పల్లెటూరి అమ్మాయిగా అలాగే ఆ గ్రామంలోని వాతావరణంలో ఇమిడి పోతూ కాస్ట్యూమ్స్ నుండి యాస వరకు పర్ఫెక్ట్ గా సింక్ చేసి ఆమె చేసిన నటనకు ప్రేక్షకులు ముద్దులయ్యారు. అలాగే ఈ చిత్రంలో హీరో పక్కనే మనకు కనిపిస్తూ ఉండే శివకుమార్ మట్ట హీరోకు మంచి సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తూ చత్రమంతటా ప్రేక్షకులను అలరించారు. ఇంట్లో గోపి చిత్రానికి మరొక బోనస్ గా నిలుస్తూ తన టైమింగ్ ఇంకా కామెడీతో డైలాగ్స్ పలుకుతూ చాలా బాగా పెర్ఫాన్ చేశారు. కల్పలత, తులసి, అరుణ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ సినిమాలో తమదైన ప్రాముఖ్యతను చూపిస్తూ సినిమాకు బోనస్ గా నిలిచారు. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అంతా తమ పాత్ర పరిధిలో తమ నటిస్తూ చిత్రానికి ప్లస్ అయ్యారు.
సాంకేతిక విశ్లేషణ :
తనను తాను తక్కువ అంచనా వేసుకుని బాధపడుతూ ఉండే ఒక యువకుడి కథను తన కోణం నుండి చూపిస్తూ ప్రేక్షకులకు అర్థమయ్యేలా అదే విధంగా ప్రేక్షకులు దానిని ఎలా చూడాలి అని ఒక సందేశాత్మకంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో దర్శకుడు వినయ్ రత్నం విజయం సాధించారు. మారుమూల లొకేషన్స్ కేరళ ను తలపిస్తూ చాలా న్యాచురల్ గా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆ లొకేషన్స్ కు తగ్గట్లు విజువల్స్ చూపించడంలో డిఓపి సక్సెస్ అయ్యారు. చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలాగే పాటలు బోనస్‌గా నిలిచాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటీనటులు అందరూ మాట్లాడిన యాస ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఫీలయ్యే విధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటులు నటన, లొకేషన్స్, పాటలు.
మైనస్ పాయింట్స్ :
కొన్ని సీన్స్ దగ్గర స్లోగా అనిపించవచ్చు.
సారాంశం :
తరువాత తరాలకు తన ప్రమేయం లేకుండా వచ్చిన ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తి చూపించకూడదు అంటూ చెబుతూ ప్రేక్షకులంతా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’.


