ENE 2 పై కొత్త అప్డేట్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్ తదితరులు కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈ నగరానికి ఏమైంది. ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు పొందిన ఈ చిత్రం త్వరలో రెండవ భాగం ఉంటుందని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సాయి సుశాంత్ ఈ చిత్రంలో ఉండరు. ఇప్పటికే ఈ రెండవ భాగం అప్డేట్ రావడానికి చాలా సంవత్సరాల గ్యాప్ రావడంతో అతను మరొక మార్గంలో కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంపై కొన్ని చర్చలు జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఇప్పుడు గాయపడిన సింహం అనే చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైజర్ విడుదల కార్యక్రమంలో ENE 2 చిత్ర అప్డేట్ చెప్పు ఇప్పటికే ENE 2 మొదలైందని, మొదటి భాగం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే రెండవ భాగం షూటింగ్ కూడా మొదలు పెడతామని తెలిపారు. దీనితో ఈ చిత్ర అభిమానులు అందరూ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles