
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య అరవింద్ సంగీతాన్ని అందించిన చిత్రానికి దినేష్ పురుషోత్తమ డిఓపిగా పనిచేశారు. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక మిడిల్ క్లాస్ యువతి యువకుడు తమ కలలను నెరవేర్చుకునేందుకు చెన్నై నగరానికి వెళ్తారు. అక్కడ మొదలైన వారి ప్రేమగా ఎలా మారుతుంది? అక్కడ వారికి ఎదురైన పరిస్థితులు ఎటువంటివి? వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు? వారి కుటుంబాలు వారి ప్రేమకు సపోర్ట్ చేశారా లేదా? చివరికి ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
సంతోష్ శోభన్ పాత్ర ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంటీరియర్ డిజైనర్ కావాలని కలలు కంటూ ఆ ప్రయాణంలో బ్రతుకుతెరువు కోసం చెన్నైలో బైక్ పోలింగ్ చేస్తుంటారు. అయితే అటు ఎమోషనల్ గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా అలాగే ఇటు తాను ప్రేమించిన అమ్మాయికి న్యాయం చేస్తూ రోజు కష్టపడే ఒక బైక్ పోలింగ్ యువకుడిగా అలాగే కష్టపడి పని చేస్తూ ముందుకు సాగే ఇంటీరియర్ డిజైనర్ గా ప్రతి షేడ్ లో తనదైన ముద్రను వేసుకుంటూ నటించరు. మానస వారణాసి కూడా ఇంచుమించు అలాగే ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ కోసం కష్టపడుతూ ఉంటారు. తాను కూడా తన పాత్రలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే ఫ్యామిలీ సిచువేషన్ను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా నటించారు. యోగి బాబు కామెడీ టైమింగ్ తో సినిమాను మరింత ముందుకు తీసుకువెళ్లారు. సినిమాలో నటించిన రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
సాంకేతిక విశ్లేషణ :
ఒక క్లీన్ ప్రేమ కథను కుటుంబాల మధ్య ఉన్న పరిస్థితులను ఆ కుటుంబాలలోని యువతీ యువకుల కలలను బ్యాలెన్స్ చేస్తూ రాసిన కథను తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. చాలా సాధారణమైన స్క్రీన్ ప్లే తో అద్భుతంగా టేకింగ్ చేశారు. లొకేషన్స్ చూపించడంలో అలాగే వెండి ధరపై సినిమాను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడంలో డిఓపి సక్సెస్ అయ్యారు. చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు బోనస్ గా నిలిచాయి. సినిమా రెండవ భాగం నిదానంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ కథ చాలా ఎంగేజింగ్ గా ఎమోషనల్ గా వర్క్ అవటంతో ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. ఎఫెక్ట్స్ కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో నిర్మాణాలు అద్భుతంగా ఉన్నట్లు అర్థమవుతుంది. గొరిల్లా టేకింగ్ కావడంతో సినిమా మరింత న్యాచురల్ గా అనిపించింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, బిజిఎం, పాటలు.
మైనస్ పాయింట్స్ :
రెండవ భాగం కొంచెం స్లోగా ఉండటం.
సారాంశం :
ఒక మంచి క్లీన్ ప్రేమ కథ. కుటుంబ విలువలు, ఎమోషన్స్ అలాగే మెచ్యూరిటీ ఉన్న కథగా కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.


