
గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన సినిమా హే బల్వంత్. సీనియర్ నటుడు నరేష్ ప్రముఖ పాత్ర పోషించిన ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం జంటగా నటించగా వెన్నెల కిషోర్, యాంకర్ స్రవంతి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా మహి రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బన్నీవాస్, వంశీ నందిపాటి తమ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను నేడు తీసుకొచ్చారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక యువకుడు తన చిన్నప్పటినుండి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు. అజయ్ దేయంగా ముందుకు సాగుతూ ఉంటాడు కానీ అతనికి ఆ బిజినెస్ ఏంటి అనేది తెలియదు. అయితే ఆ బిజినెస్ ఏంటో తెలుసా అతను ఆ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఇష్టపడతాడా లేదా? అసలు ఆ బిజినెస్ ఏంటి? అలా ఉన్న అతని జీవితం నుంచి వచ్చిన అమ్మాయితో అతని ప్రయాణం ఎలా సాగుతుంది? ఎలా మలుపులు తిరుగుతుంది? అనుకోకుండా వచ్చిన అతని జీవితంలోని సమస్యకు అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మధ్య సంబంధం ఏంటి? చివరికి వారి బిజినెస్ అలాగే వారి జీవితాలు ఎలా మారుతాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఇప్పటికే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను తన పాత్రలతో తన నటనతో నేర్పించిన వీకే నరేష్ గారు ఈ చిత్రంలో కూడా తన విభిన్న పాత్రతో ప్రేక్షకులను నూటికి నూరు శాతం మెప్పించారు. అలాగే చిత్రంలో హీరోగా నటించిన సుహాస్ తన గత చిత్రాల పాత్రలకు సంబంధం లేకుండా కొత్త పాత్రతో ఎమోషన్స్ ఇంకా తన కామెడీ యాక్షన్ తో చాలా బాగా నటించారు. హీరోయిన్గా నటించిన శివాని ఇప్పటికే గత రెండు చిత్రాలతో తన నటనను ప్రూవ్ చేసుకున్నారు. ఈ చిత్రంలో కూడా తన పాత్రలో ఎంతో చక్కగా నటిస్తూ ప్రేక్షక అభిమానులను ఆమె నేర్పించారు. ఈ చిత్రంతోనే కీలక పాత్రలో వెండితెరపై తొలిసారి కనిపించిన యాంకర్ స్రవంతి తన పాత్రకు తగ్గట్లు న్యాయం చేస్తూ అటు ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుండి ఇటు నటన ఇంకా డైలాగు డెలివరీ వరకు ప్రతి విషయంలోనూ కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షక అభిమానుల మనసులు దోచుకున్నారు. అలాగే చిత్రంలో నటించిన అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ తదితరులు అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత ప్లస్‌గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
ఒక వ్యాపారం ఏంటి అనే ప్రశ్నతో ట్రైలర్ నుండి ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ డైరెక్టర్ తాను రాసుకున్న కథను వెండితెరపై చూపిస్తూ ఎవడి మనోభావాలు దెబ్బ తినకుండా చాలా సాధారణంగా ప్రేక్షకులలో తీసుకుని రావడం చాలా కష్టమైన విషయం. అదికూడా సమాజం చాలా సెన్సిటివ్ గా చూసే విషయం పట్టుకొని అది ప్రేక్షకులు అంగీకరించే విధంగా తీసుకుని రావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే దాని ఎంతటిని కెమెరాలో సంబంధించి వెండి ధరపై చూపిస్తూ డిఓపి సక్సెస్ సాధించారు. సినిమాలోని పాటలు ఇంకా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. నిర్మాణం విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, బిజిఎం, కామెడీ, ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ పండని కొంత కామెడీ.
సారాంశం :
నవ్వులతో, సెంటిమెంట్ ఇంక ఎమోషన్స్ తో కూడిన ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ చిత్రంగా హే బల్వంత్ చెప్పుకోవచ్చు.


