
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు, నయన సారిక జంటగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మంచి పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ చిత్రం థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లలో ఏకంగా 54% జంప్ సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. తొలిరోజు 31.2 వేల టికెట్లు అమ్ముడవగా.. రెండవ రోజు ఆ సంఖ్య 48.1 వేలకు చేరుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 9.10 కోట్ల గ్రాస్‌ను రాబట్టి వీకెండ్‌కు బలమైన పునాది వేసింది.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటం, మూడవ రోజు బుకింగ్స్ మరింత అద్భుతంగా ఉండటంతో ‘విష్ణు విన్యాసం’ భారీ బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది.


