
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఒక్కరోజే 5.6 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.
క్లీన్ హ్యూమర్, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ టాక్, ప్రధాన కేంద్రాల్లో నమోదవుతున్న మంచి ఫుట్‌ఫాల్స్ చిత్ర విజయాన్ని మరింత బలపరుస్తున్నాయి.
దర్శకుడు మారుతి రావు తీసుకువచ్చిన తాజాదనం, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి, సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం మొదటి వారం లోనే బ్లాక్‌బస్టర్ దిశగా పయనిస్తోంది.


