
‘మంజుమ్మల్ బాయ్స్’ డైరెక్టర్ చిదంబరంపై ఎర్నాకుళం టౌన్ సౌత్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో కొచ్చిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి
ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. BNSలోని సెక్షన్ 74, 75 కింద కేసులు బుక్ అయ్యాయి. మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన ‘హేమ కమిటీ’ నివేదిక తర్వాత వెలుగులోకి వస్తున్న వరుస కేసుల్లో ఇది మరొకటి.


