“పెద్ది” ‘రాయ్ రాయ్ రా రా’ సాంగ్ రికార్డు సృష్టి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన రెండో సింగిల్ ‘రాయ్ రాయ్ రా రా’ భారీ సంచలనం సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట మొత్తం ఐదు భాషల్లో కలిపి 46.1 మిలియన్‌కు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా లైక్స్ సాధించి ట్రెండింగ్ నెం.1గా నిలిచింది. తెలుగు వెర్షన్ ఒక్కటే 29.21 మిలియన్ వ్యూస్ సాధించి, ముందుగా ‘చికిరి చికిరి’ సెట్ చేసిన 29.1 మిలియన్ రికార్డును అధిగమించింది.

ఆస్కార్ విజేత A.R.రెహమాన్ తన థండర్ బీట్స్‌తో నిండిన కంపోజిషన్‌తో పాటు శక్తివంతమైన వోకల్స్‌తో పాటకు ప్రత్యేక మాజిక్ జోడించారు. సాహిత్యాన్ని అనంత శ్రీరామ్ ఘాటుగా, లోతుగా అందించారు.

రామ్ చరణ్ తన స్వాగ్, ఎనర్జీతో స్క్రీన్‌పై అగ్నిపర్వతంలా విరుచుకుపడ్డారు. జానీ మాస్టర్ రూపొందించిన క్లిష్టమైన స్టెప్పులను ఆయన ఈజీగా, ఎక్స్‌ప్లోసివ్‌గా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు. దర్శకుడు బుచ్చి బాబు సన తన రస్టిక్ విజువల్స్‌తో పాటకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చారు.

వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

Latest Articles