
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ. ఈ సినిమాకి ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్. ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. అద్భుతమైన క్వాలిటీతో బయటికి తీసుకొచ్చారు. సెకండ్ హీరో మా డైరెక్టర్. నన్ను బలంగా నమ్మి ఈ క్యారెక్టర్ కి నేనైతే బాగుంటుందని హీరోగా పెట్టారు. మా నిర్మాత డైరెక్టర్ గారి నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను. డీవోపీ అమ్మముత్తు, సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ సినిమాకి మరింత బలాన్ని ఇస్తాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్ లోనే ఉంటారు. నేను హీరో అవుదామన్న ప్రతిసారి నీ మార్కెట్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. నిజానికి మీరు ఆదరిస్తేనే ఒక మార్కెట్ వస్తుంది. మంచి కథల్ని ఎన్నుకోవాలి, మంచి టెక్నీషియన్స్ తో పనిచేయాలి. ఈ సినిమాకి అదే చేశాను. ఈ సినిమాలో కామాక్షి గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గాయత్రి కూడా చాలా చక్కని నటన కనబరిచారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం 100% ఎఫర్ట్ పెట్టాను. ఈ సినిమా నాకంటే నా టీం కోసం గెలవాలి. ఈ సినిమా గెలిస్తే ప్రతి ఒక్కరు గెలుస్తారు. చిన్న అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే మా జీవితాలు అంకితం. నిజాయితీతోనే ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మార్చి 6న సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందరూ సినిమా చూసి నచ్చితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరం థియేటర్స్ లో కలుద్దాం.
నిర్మత రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ హోలీ, చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాను .బాల సతీష్ నేను కథ విషయంలో చాలా కసరత్తు చేశాం. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.
హీరోయిన్ గాయత్రి రమణ మాట్లాడుతూ.. జ్యోతి అనే అమ్మాయి మల్లేష్ జీవితంలో ఎంత కీ రోల్ ప్లే చేసిందనేదే నా క్యారెక్టర్. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది. శ్రీనాథ్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది.
రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా మెమొరబుల్ జర్నీ. మా నిర్మాత చాలా పాషన్ తో ఈ సినిమా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకోబోతుంది. శ్రీనాథ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మంచి ఎమోషనల్ ఫిల్మిది. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. నా జర్నీలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. మంచి టీం వర్క్ తో ఈ సినిమా చేసాం. సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా పర్సనల్. నిర్మాత రాజేష్ గారు నాకు ఒక సొంత అన్నలాంటివారు. ఈ సినిమా ఆయన కోసం అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఆయన మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలనే తపనతో ఈ సినిమా చేశారు. డైరెక్టర్ బాల సతీష్ చాలా పాషన్ తో ఈ సినిమా తీశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.


