నూతన దంపతులు విజయ్ దేవరకొండ ,రష్మిక లకు స్వయంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈరోజు సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసాన్ని సందర్శించారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

రిసెప్షన్ కార్యక్రమం సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.

Related Articles

Latest Articles