“సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని” చిత్ర రివ్యూ

ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మించగా సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని. రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతాన్ని అందించగా బాలు మనోజ్ ఎడిటింగ్ చేశారు. ఎన్నో సంవత్సరాల తర్వాత శివాజీ, లయ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, ప్రిన్స్, అలీ, ధనరాజ్, ఇమ్మాన్యూల్, శరత్ లోహితశ్వ, రాజ్ తిరందాసు, బండ్ల గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక గ్రామంలో నిజాయితీ పరుడైన పంచాయతీ సెక్రెటరీగా పని చేస్తున్న మద్య తరగతి వ్యక్తి తన భార్య, కొడుకుతో సంతోషంగా ఉంటారు. అలా సజావుగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి ఒక అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య వల్ల తన కుటుంబమంతా ప్రమాదంలో ఉండడంతో సమస్య నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా అతనికి అక్కడ రాజకీయ నాయకుల నుండి మరొక సమస్య వస్తుంది. ఇటువంటి క్లిష్టకరమైన సమస్యల మధ్య నుండి అతను తన కుటుంబాన్ని కాపాడుకొని ఎలా బయటపడతారు అనేది ఈ చిత్ర కథ. అసలు అతనికి వచ్చిన సమస్యలు ఎటువంటివి? ఆ సమస్యల నుండి వాళ్ళు ఎలా బయటపడతారు? చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తులపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఇప్పటికే హీరోగా, ఇతర క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులను అన్ని విధాలుగా మెప్పించిన శివాజీ (శ్రీరామ్) నటన గురించి అందరికీ తెలిసిందే. ఒక మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో గతంలోని తన చిత్రాలలో కూడా నటించిన ఆయన ఈ సినిమాలో మరొక కోణంలో కనిపించడం జరుగుతుంది. అలాగే ఎవర్ గ్రీన్ హీరోయిన్ లయ(ఉత్తర) గతంలోనే తల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ఇద్దరు జంటగా కనిపిస్తుంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పక్క అనే విషయం ఫిక్స్. అయితే వీరితో పాటుగా తమ కొడుకు పాత్రలో నటించిన రోహన్ ఈ సినిమాలో మరింత ఎంటర్టైన్ చేస్తూ కనిపించాడు. అలాగే ప్రిన్స్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కాస్త కొత్తగా కనిపించారు. అలాగే అలీ, ధనరాజ్, ఇమ్మాన్యూల్, శరత్ లోహితశ్వ, రాజ్ తిరందాసు తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అలాగే చిత్రంలో నటించిన నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక క్రైమ్ థ్రిల్లర్ కథను కాస్త హాస్యాన్ని జోడించి అర్థం అయ్యేలా ప్రేక్షకులకు సినిమా రూపంలో చూపించడం సాధనమైన విషయం కాదు. అటువంటి ఒక కథను ప్రేక్షకులకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చూపించడంలో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ సక్సెస్ అయ్యారు. అలాగే సినిమాను వెండితెరపై చూపించేందుకు పర్ఫెక్ట్ గా కెమెరా యాంగిల్స్ లో పెట్టి చూపించడంలో డిఓపి ఇంకా అలాగే తగ్గట్లు కతలించడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యారు. బ్యాగ్రౌండ్ సంగీతం తో పాటు సాంగ్స్ చిత్రానికి భలాన్ని చేకూర్చాయి. సినిమా మొదటి హాఫ్ ఇంకా అలాగే రెండవ హాఫ్ లో ముందు 15 నిమిషాల పాటు నిదానంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులు అలరించింది. కలరింగ్, ఫ్రేమింగ్, గ్రాఫిక్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు. నిర్మాణములోలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, బిజిఎం

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నిదానంగా ఉండటం

సారాంశం :
ఒక క్రైమ్ ట్రేలర్ కథను హాజరుకంలో ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కుటుంబ సమేతంగా కూర్చుని చూసే విధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన చిత్రం సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని.

Related Articles

Latest Articles