శర్వా ‘బైకర్’ నుంచి యాంథమ్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథ.  

శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్  జిద్ధి జిద్ధి అనే సరికొత్త ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సినిమా ఆల్బమ్‌లో ఒక స్పూర్తిదాయక మోటివేషనల్ ఆంథమ్‌గా నిలుస్తోంది. జిబ్రాన్ స్వరపరిచి పాడిన ఈ పాటలో షెన్‌బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ కూడా వోకల్స్ అందించారు. కృష్ణకాంత్ రాసిన ఈ సాహిత్యం లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల, ధైర్యం, నిరంతర ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోంది.

పాటలోని మాంటేజ్‌లో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్‌గా మారే ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. కఠినమైన వర్కౌట్స్, ఎండ్యూరెన్స్ రన్స్ చేయడం, వర్క్‌షాప్‌లో తన డర్ట్ బైక్‌ను స్వయంగా రిపేర్ చేయడం వంటి సన్నివేశాలు అతని అంకితభావం, క్రమశిక్షణను హైలైట్ చేస్తున్నాయి. ఈ ట్రైనింగ్ లో రాజశేఖర్ ఒక మెంటర్‌గా కనిపిస్తూ శర్వా ప్రోగ్రెస్‌ను పర్యవేక్షించడం ఎమోషన్ ని మరింత పెంచుతోంది.

అద్భుతమైన రిథమ్, ఆకట్టుకునే విజువల్స్‌తో “జిద్ధి జిద్ధి” పాట విడుదలైన వెంటనే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జె యువరాజ్ సినిమాటోగ్రఫీని, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తాడు, ఎ. పనీర్ సెల్వం ఆర్ట్ డైరెక్షన్‌, అనిల్ కుమార్ పి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

బైకర్ ప్రేక్షకులకు లీనమయ్యే థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి డాల్బీ సినిమా, EPIQ, 4DX , PCX వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో కూడా విడుదల అవుతుంది.  

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Related Articles

Latest Articles