
‘తండేల్’ సినిమాలో అద్భుత నటనకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డు’ను సొంతం చేసుకున్న యువసామ్రాట్ నాగ చైతన్యను అన్నపూర్ణ స్టూడియోస్ బృందం శనివారం ఘనంగా సన్మానించింది.
ఈ సంతోషకరమైన వేడుకలో ‘తండేల్’ చిత్ర నిర్మాత బన్నీ వాసు గారితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చైతన్య అభినయానికి దక్కిన ఈ ప్రభుత్వ గుర్తింపును చూసి అన్నపూర్ణ కుటుంబం మురిసిపోయింది. చప్పట్లు, కేరింతల మధ్య సిబ్బంది అంతా ఒక్కటై తమ అభిమాన నటుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


