
తిరుమల శ్రీవారిని నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.
ఇటీవలే ఆయన హైదరాబాదు నుండి తిరుపతికి కాలినడకన వెళ్లి శ్రీవారికి తన తలనీలాలను సమర్పించుకుని మొక్కు తీర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.


