
తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి కొణిదెల ఫిర్యాదు చేశారు. ‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఇన్స్టా ఖాతా ద్వారా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, దూషణలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి, ఆ వివాదాస్పద పోస్టులను తొలగించాలని ఆమె కోరారు.


