
ప్రముఖ నటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాలు, ట్రోల్స్‌పై తీవ్ర స్థాయిలో స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ ప్రచారం చేస్తూ వస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా తన పాత ప్రైవేట్ ఆడియోను కొందరు ఆన్‌లైన్‌లో లీక్ చేయడంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల తనకే కాకుండా, తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ప్రైవసీకి తీవ్ర భంగం కలుగుతోందని ఆమె మండిపడ్డారు. తన వ్యక్తిగత జీవితంపై ఇతరుల జోక్యం ఏమాత్రం అవసరం లేదని, ఎవరి హద్దుల్లో వారు ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తన పరువుకు నష్టం కలిగిస్తున్న వారికి రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తన గురించి, తన ప్రైవేట్ ఆడియోలకు సంబంధించి పోస్ట్ చేసిన కంటెంట్‌ను 24 గంటల్లోగా పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ కంటెంట్‌ను నిర్ణీత సమయంలోగా తొలగించకపోతే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


