హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌ ను లాంచ్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి

హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్‌ స్టూడియోస్‌ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఎఫ్‌‌డీసీ ఛైర్మన్‌‌, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో- నిర్మాత రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ పాల్గొన్నారు.

నెట్‌ఫ్లిక్స్ కార్యాలయం ప్రారంభం కావడం హైదరాబాద్‌లో ఎంటర్టైమెంట్ రంగానికి ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది. ఈ స్టూడియో ప్రారంభంతో హైదరాబాద్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మరింత బలపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంతో ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్, టెక్నాలజీ, క్రియేటివ్ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

Related Articles

Latest Articles