ఎంజీఆర్ వివాదం: రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు.. కృతజ్ఞతలు తెలిపిన నటుడు విశాల్

​దివంగత నటుడు ఎంజీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన మాటల పట్ల ఎంజీఆర్ అభిమానులు, ఆయనతో కలిసి పనిచేసిన వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) జోక్యం చేసుకుని, రాజేంద్ర ప్రసాద్ గారిని వివరణ కోరింది.

​పరిస్థితిని అర్థం చేసుకున్న రాజేంద్రప్రసాద్ గారు వెంటనే స్పందిస్తూ.. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే మన్నించాలని కోరుతూ హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు. ఆయన స్పందనపై నటుడు విశాల్ హర్షం వ్యక్తం చేశారు. వివాదాన్ని పెంచకుండా వెంటనే క్షమాపణలు కోరిన రాజేంద్రప్రసాద్‌కి విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడం రాజేంద్రప్రసాద్ గారి నిజమైన గొప్పతనానికి, ఆయనలోని వినయానికి నిదర్శనమని విశాల్ ప్రశంసించారు.

Related Articles

Latest Articles