ఈ నెల 26న రిలీజ్ కు వస్తున్న “యూత్” మూవీ

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ “యూత్”. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న “యూత్” మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు.

“యూత్” సినిమాకు ఇప్పటికే తమిళనాట మంచి బజ్ క్రియేట్ అయ్యింది. హీరో ధనుష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై క్రేజ్ పెంచారు. రీసెంట్ గా తెలుగు పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఇక్కడి ప్రొడక్షన్ హౌస్ ల నుంచి మంచి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఈ2సీ బ్యానర్ “యూత్” మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యి వాళ్లు రిలాక్స్ అయ్యే టైమ్ కాబట్టి ఈ నెల 26వ తేదీ తెలుగుకు పర్పెక్ట్ రిలీజ్ డేట్ గా మేకర్స్ భావిస్తున్నారు. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా యంగ్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతోంది.

నటీనటులు – కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
స్క్రిప్ట్, డైరెక్షన్ – కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ – పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ – ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ – వికి
ఎడిటర్ – నాష్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ – కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
స్టంట్ – కలై కింగ్సన్
కొరియోగ్రఫీ – శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
సౌండ్ మిక్స్ – అర్వింద్ మీనన్
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పోస్టర్స్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Related Articles

Latest Articles