“ఉస్తాద్ భగత్ సింగ్” చిత్ర రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా డి.ఎస్.పి, తమన్ నిఖితానికి సంగీతం అందించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలగా వ్యవహరించిన ఈ చిత్రానికి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ చేయగా కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు. పార్థిబన్, రావు రమేష్, రవికుమార్, రామ్కి తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఒక యువకుడి ఉస్తాద్ భగత్ సింగ్ తన ఉపాధ్యాయుడు వల్ల చదువుకుంటూ పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ ఉపాధ్యాయుడు తన మంచితనం వల్ల రాజకీయాల్లోకి వచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారు. అయితే తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతనికి వచ్చిన ఒక కష్టం వల్ల ఉస్తాద్ తనకోసం వస్తాడు. అయితే అసలు అతనికి వచ్చిన కష్టం ఏంటి? అతని జీవితంలోకి శ్లోక, లీల ఎలా వస్తారు? చివరికి ఉస్తాద్ తో ఎవరికి పెళ్లి అవుతుంది? ఈ కథలోకి ఉగ్రవాదులు ఎలా వస్తారు? వారి నుండి ఉస్తాద్ తన వారిని ఎలా కాపాడుకుంటాడు? అని ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు నటన :
పవన్ కళ్యాణ్ (ఉస్తాద్ భగత్ సింగ్) పోలీసుగా తన నటన ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే ఎన్నో సినిమాలలో ప్రేక్షకులు చూసినప్పటికీ ఈ చిత్రంలో తన పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంది. అంతేకాక ఈ సినిమాలో డాన్స్ కూడా వేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో ఎంతో సంతోషంగా పవన్ కళ్యాణ్ నటించారు. అలాగే రాశి ఖన్నా (శ్లోక) పాత్రలో వెండి తలపై కనిపించిన సమయం తక్కువ అయినప్పటికీ తన పాత్రకు తగ్గట్లు నటిస్తూ తనదైన ముద్రణ వేసుకున్నారు. ఈమె పాత్ర గత సినిమాలతో పోలిస్తే ఎక్కడ సంబంధం లేకుండా ఎంత విభిన్నంగా ఉండటం విశేషం. శ్రీలీల (లీల) ఒక రేడియో జాకి పాత్రలో యువకుల మనసులు దోచుకునే విధంగా కనిపిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే పార్థిబన్, రావు రమేష్, రవికుమార్ అతడు ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉన్నాయి. సినిమాలో కనిపించిన ఇతర నటీనటుల పాత్రలు సినిమాలో తమ పాత్రలకు తగ్గట్టు తమ పరిధిలో తమ నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
సరికొత్త కథను సరికొత్త రూపంలో రాసుకుని దానిని ప్రేక్షకుల ముందుకు అలాగే ఎంతో అభిమాన నటుడు అయిన పవన్ కళ్యాణ్ వ్యక్తిని కథానాయకుడిగా చూపించడంలో హరీష్ శంకర్ మరొకసారి విజయం సాధించారు. అటువంటి విజువల్స్ ను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తీసి చూపించడంలో డిఓపి ఇంకా ఎడిటర్ సక్సెస్ అయ్యారు. కలరింగ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇతర సాంకేతక విషయాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువల గురించి చెప్పనవసరం లేదు, అంత బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ తో పాటు పాటలు కూడా చాలా ప్లస్గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ లోని పాట ఇంకా బిజిఎం సెకండ్ హాఫ్ అంత వినిపిస్తూ అభిమానుల మనసులు దోచుకుంది.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, పాటలు, నటీనటులు నటన.

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం.

సారాంశం :
అభిమానులకు ఫుల్ మీల్స్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.

Related Articles

Latest Articles