గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక మార్చ్ 19న ఉగాది సందర్భంగా హైటెక్స్ లో ఘనంగా జరిగింది. 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అనేక మంది సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చిరంజీవి ఈ గౌరవాన్ని అందుకున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి తన ప్రసంగంలో పలువురు విజేతలకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ఈనాటి చాలా హృద్యంగా, ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్’ కార్యక్రమానికి మూలవిరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మిత్రులు, పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహజనుడు, నా ఇష్టుడు, నా మిత్రుడైన లోకనాయకన్ కమల హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే నాగేశ్వరరావు గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించినటువంటి నాగచైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన్న, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను.

ఈ శ్రీ క్రోధి నామ (ప్రభావనామ) తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెల్లబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో, అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, ఒక సమయంలో కుంటుపడి ఉన్న లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్‌ని, ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి, కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి అనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి, మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈరోజు ఇంత బాగా సజావుగా సాగటానికి, ఇంత హృద్యంగా సాగటానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.

సార్(రేవంత్ రెడ్డి), మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ.. ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది దేశం మొత్తానికి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల యాంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాస్ పర్ సినిమా ఈజ్ కన్సర్న్డ్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతీయ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, దానికి అవసరమైనట్లుగా మేమందరం సమాయత్తమయ్యాము అంటూ, దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ బృహత్కార్యాన్ని భట్టి గారికి అప్పజెప్పారు.

వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి, వారిని ఆహ్వానించి, మంచి చెడ్డల గురించి తర్కించి, చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు.. ‘మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి’ అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ (WAVES) అని, మన సాఫ్ట్ పవర్‌ని ప్రపంచ దేశానికి తెలియజేప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడలు కానివ్వండి, మన గ్రామీణానికి సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి.. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే గనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంతా ఉండదు, వాళ్ళని ఆకర్షించుకోగలిగితే గనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి, దీని వేవ్స్ అని ఈ మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామిని చేశారు.

కమల హాసన్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవిచూశారు. కే-పాప్ అని ఒక దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే-పాప్ గానీ, కే-సినిమా గానీ, అలాగే జపాన్‌కు సంబంధించిన అనిమే గానీ.. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసినాయి. దానికి ఎంతో తోడ్పాటు అందించింది, వాళ్ళ జీడీపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలికగా ‘సినిమా కదా ఏముందిలే ఇందులో’ అనేలాగా తీసుకోకుండా, దీని యొక్క ప్రభావంతోటి మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనకు ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్య ఉద్దేశంతోటి మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన బృహత్కార్య కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ.. మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసావహిస్తూ ముందుకు సాగుతాము, ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్.

ఇక్కడ సందర్భమో కాదో తెలియదు కానీ, మన పక్క రాష్ట్రం అయినటువంటి మన మరో తెలుగు రాష్ట్రం, ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల, వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే గనుక, మీరు ఇచ్చే ఉత్సాహంతోటి ఎంతోమంది యంగ్స్టర్స్ ఈరోజున మరిన్ని మంచి సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకు కాంట్రిబ్యూట్ అవుతుంది, మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన చేయవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారిని నేను విన్నవించుకుంటున్నాను.

అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే గనుక, ఇది సీనియర్స్‌కు గౌరవాన్ని ఇచ్చే విధంగానూ, అలాగే యంగ్స్టర్స్‌ని ఉత్సాహపరిచే విధంగానూ చాలా చక్కగా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. దానికి గాను ప్రత్యేకించి మన జూరీ కమిటీకి గానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.” అని ఆయన అన్నారు.

https://x.com/kchirutweets/status/2034841137492762698?s=46

Related Articles

Latest Articles