
’తండేల్’ సినిమాలో తన అద్భుత నటనకు గాను 2025 ‘తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డు’ (ఉత్తమ నటుడు) అందుకున్న సందర్భంగా హీరో నాగ చైతన్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు వ్యక్తపరిచారు.
ఈ సినిమా తన మనసుకు చాలా దగ్గరైనదని చెబుతూ.. “ఇలాంటి ఒక నిజమైన, వీరోచితమైన కథను తెరపైకి తీసుకువచ్చే అవకాశం దక్కడం నా అదృష్టం, నా కృతజ్ఞతను మాటల్లో చెప్పలేను” అని చైతన్య అన్నారు. నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తనకో ప్రత్యేకమైన ప్రయాణమని ఆయన పేర్కొన్నారు. ప్రీ-ప్రొడక్షన్ సమయంలోనే ఆ నిజ జీవిత వ్యక్తులను కలవడం, వారి కథలు వినడం తనను ఎంతగానో ప్రేరేపించాయని, ఈ ప్రయాణం తనపై ఎంతో వ్యక్తిగత ప్రభావాన్ని చూపిందని తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును అందించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా గద్దర్ అవార్డుల కమిటీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తనకు ఈ అవార్డును ప్రదానం చేసిన హీరో రామ్ చరణ్‌కు కూడా నాగ చైతన్య కృతజ్ఞతలు తెలియజేశారు.
https://x.com/i/status/2035314430171631909


