
సీనియర్ హీరోయిన్ రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఇతర భాషల్లో 300 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పైగా 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి, స్టార్లతో నటించింది. ఆమె తాజాగా ఓ ఇంటర్యూలో రాశి తన సినీ కెరీర్ గురించి, పర్సవల్ లైఫ్ గురించి కామెంట్స్ చేశారు. అలా రాశి మాట్లాడతూ.. నేను పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనే. నన్ను హీరోయిన్ ని చేయాలని మా నాన్న గారు చాలా తపన పడ్డారు. ఆయన కారణంగానే హీరోయిన్ అయ్యాను. ఇక వ్యక్తిగతంగా ప్రేయసిరావే సినిమా అంటే నాకు గొప్ప ఎమోషన్. ఆ సినిమాని ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. మా నాన్న గారు చివరిగా చూసిన సినిమా కూడా ప్రేయసిరావే. అందుకే ఆ సినిమా నాకు అప్పటికీ గుర్తుండిపోతుంది” అని రాశి చెప్పుకొచ్చారు. రాశి ఇంకా మాట్లాడుతూ… “నేను అప్పట్లో లావుగా ఉన్నానని అనేవారు. కాని నిజానికి నేను పెళ్లి చేసుకోవడానికే లావు అయ్యాను. పైగా నేను 22 వయసులోనే పెళ్లి చేసుకున్నా, అయినా నేను ఇలా కనిపించడానికి నేను మిక్స్ బ్రీడ్. నాన్న బ్రాహ్మిణ్, అమ్మ గౌడ. నాకు నాన్న కులమే వర్తిస్తుంది కాబట్టి నేను బ్రాహ్మిణ్” అన్నారు.


