
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. “దీవాన” సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అనంతరం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కొరియోగ్రాఫర్ కృష్ణ మాట్లాడుతూ – నేను చాలా రియాల్టీ షోస్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేశాను. ఈ చిత్రంలో కొరియోగ్రఫీ చేసే అవకాశం మా డైరెక్టర్ శ్రీకాంత్ కల్పించారు. కొత్త టాలెంట్ కు అవకాశం ఇస్తున్న ఈ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో పాటలన్నీ ఛాట్ బస్టర్స్ అవుతాయి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ – నేను రెహమాన్ గారి మ్యూజిక్ స్కూల్ లో చదివాను. ఇది నా ఫస్ట్ మూవీ. ఈ సినిమాకు దీవానా దీవానీ అంటే మా ప్రొడ్యూసర్స్. చాలా ఫ్రీడమ్ ఇచ్చి పాటలకు ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. మా డైరెక్టర్ నాతో సాంగ్స్ మాత్రమే కాదు లిరిక్స్ కూడా రాయించుకున్నారు. యాక్టర్స్ తో డైలాగ్స్ రాయించారు. అందరితో అన్ని వర్క్స్ వర్సటైల్ గా చేయించుకున్నారు. సినిమా అంటే అందరం పనిచేయాలి అంటుంటాడు మా డైరెక్టర్. దీవాన మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ – నందినీరెడ్డి నేను ప్రొడ్యూసర్ కావాలని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే అల్లు అరవింద్ గారు, విద్య అక్కకు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు నాకు ఎంతో సపోర్ట్ అందించారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ శ్రీకాంత్ ఫస్ట్ ప్రొడ్యూసర్ వాసుదేవ్ కు కథ చెప్పాడు. ఆ ఎగ్జైట్ మెంట్ ను మా అందరికీ ఇచ్చారు. శ్రీకాంత్ ఎంతో ప్రతిభావంతంగా మూవీని రూపొందించాడు. హర్షిత్, స్మేహ తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. ఈశ్వర్ చంద్ మ్యూజిక్ మా మూవీకి ఆకర్షణగా నిలుస్తుంది. మా ఫస్ట్ సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – మేము కొద్దికాలంగా సినిమా ప్రొడక్షన్ లోకి రావాలనుకుంటున్నా, ధైర్యం చాలక ఆగిపోయాం. కానీ డైరెక్టర్ శ్రీకాంత్ ఈ కథ చెప్పినప్పుడు ఎందుకో చాలా ధైర్యంగా అనిపించింది. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో మూవీకి ఏం కావాలో అవన్నీ సమకూరేవి. సినిమానే తనకు కావాల్సినవన్నీ తీసుకుంటోంది అనుకునేవాళ్లం. దీవాన ఈ కథ విన్నప్పుడు ఇది ప్రతి తెలుగు అబ్బాయి ఎమోషన్, మీ, నా ఎమోషన్ అనిపించింది. అలాగే ప్రతి తెలుగు అబ్బాయి పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్స్ లో దీవాన చిత్రంతో మొము మీ అందరికీ ఒక బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నాం. అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ – దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగా చూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. మా దైవం అరవింద్ గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. మీ ఫేవరేట్ మూవీ ఏదంటే మీకు వసంతకోకిల, తొలి ప్రేమ, 7జి బృందావన్ కాలనీ వంటి మూవీస్ వెంటనే గుర్తొస్తాయి. ఇప్పుడున్న యూత్ ఫ్యూచర్ లో దీవాన మూవీని గుర్తుతెచ్చుకుంటారు. అలాంటి బ్యూటిఫుల్ మూవీ ఇది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని మన లైఫ్ లా చూపించాలి. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ – ఫస్ట్ ఫిలిం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. చెప్పాలంటే ఇది మీ తొలి ప్రేమ. ఫస్ట్ లవ్ కు ఫస్ట్ సినిమాకు పెద్ద తేడా ఉండదు. మీ ప్రేమంతా ఈ సినిమాలో కనిపించింది. ఈ టీజర్ ఎన్నోసార్లు చూశాను, కానీ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మళ్లీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇది జెన్యూన్ రియాక్షన్. నేను రాజా వారు రాణిగారు చూసినప్పుడు రవికిరణ్ తో పరిచయం కూడా లేదు. కానీ నేను ఆ సినిమా గురించి సోషల్ మీడియా పోస్ట్స్ చేశాను. ఆ మూవీ నాకు బాగా నచ్చింది. దర్శకుడిలో సిన్సియారిటీ చూశా. అలాగే వెంకీ తొలి ప్రేమ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది. సినిమా పట్ల ప్రేమ ప్రతి ఫ్రేమ్ లోనూ చూశా. ఆ ప్యాషన్ ఉండబట్టే వాళ్లు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. రేపు మీరు కూడా కొత్త దర్శకులకు ఇన్సిపిరేషన్ కావాలి. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ లో హానెస్టీ చూశాను. హర్షిత్, స్మేహా ఇద్దరూ టాలెంటెడ్ యాక్టర్స్. ఈ మూవీ పై నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది.
హీరోయిన్ స్మేహ మణిమేగలై మాట్లాడుతూ – దీవాన మీ మనసుల్ని తాకే ప్రేమ కథ. ఈ చిత్రంలో నేను అమ్ము అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇలాంటి సందర్భం కోసం కలగన్నాను. ఈ వేదిక మీద నిల్చుని మాట్లాడటం నమ్మలేకపోతున్నా. దీవాన మూవీని థియేటర్స్ లో చూడండి. మీరంతా మా మూవీని లవ్ చేస్తారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ – మన లైఫ్ లో ఇదొక్కటి సక్సెస్ అయితే మన జీవితం మారిపోతుంది, జనాలు మనల్ని చూసే విధానం మారిపోతుంది అనిపిస్తుంటుంది కదా. నా జీవితంలో అలాంటి సందర్భం ఈ సినిమా. దీవానతో నా లైఫ్ మారుతుందని నమ్ముతున్నాను. దీవాన మూవీ కథ విన్న ఎగ్జైట్ మెంట్ ఇంకా నాలో ఏమాత్రం తగ్గలేదు. ఈ కథ విన్న తర్వాత వారం రోజుల దాకా అదే ఆలోచనలో ఉండిపోయాను. నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది. అన్నారు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ – దీవాన మూవీ కంటెంట్ చాలా బాగుంది. ఇది ప్రేమ సాంగ్ వినగానే ఆకట్టుకుంది. హర్షిత్, స్మేహ బాగా పర్ ఫార్మ్ చేశారు. హర్షిత్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. ఇటీవల సూర్య సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్ లోకి చిరుతపులి వచ్చింది. అది యూనిట్ లో నేను తప్ప ఎవరూ చూడలేదు. కానీ నేను ఎవరికీ చెప్పకుండా షూటింగ్ చేశాను. అది రీసెంట్ గా నా లైఫ్ లో దీవాన మూవ్ మెంట్ గా చెప్పుకోవచ్చు. అన్నారు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ – సినిమాల పరిస్థితి బాగా లేదు. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు అని అంటుంటారు. అది నేను పరిశ్రమలోకి వచ్చినప్పుడు చెప్పారు, ఇప్పుడు చెబుతున్నారు. కానీ కొత్త ఫిలింమేకర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. దీవాన సాంగ్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఇదొక సెలబ్రేషన్ లా అనిపిస్తోంది. ఇదే సెలబ్రేషన్ థియేటర్స్ లోనూ జరగాలి. గతంలో మనం సినిమాలను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఆ సెలబ్రేషన్స్ ను ఈ సినిమా మరోసారి థియేటర్స్ లోకి తీసుకురావాలి. వీళ్లంతా మరో కొత్త టీమ్ కు హోప్ ఇవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి


