

మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ, యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్గా రాజమండ్రికి చెందిన శ్రీ ఏడిద బాబి గారిని తదుపరి ప్రకటన వచ్చే వరకు నియమిస్తున్నాము.
గత ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు, శ్రీ రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల పేర్లతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, అభిమానులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ ముందుకు నడిపించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ ఏడిద బాబి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో “Mega Youth Force” సంస్థ మరింత బలోపేతం అవుతూ, యువతను సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాము.
త్వరలోనే మెగా హీరోల అభిమానులను సమన్వయం చేస్తూ. యువశక్తిని కలుపుకొని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా, పట్టణ, మండల స్థాయిల వరకు నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను విస్తరించి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాము.
మెగా అభిమానులందరూ కలిసి ఒకే లక్ష్యంతో ముందుకు సాగి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము.


