
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, కథానాయకి మాళవిక మోహన్ గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న తమ తాజా చిత్రం ‘బైకర్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారీ ప్రత్యేకమైన సానుకూల అనుభూతి కలుగుతుందని చెప్పారు. ‘బైకర్’ సినిమా భారతదేశంలోనే మొదటి మోటార్‌క్రాస్ నేపథ్యంలో రూపొందిన చిత్రమని, ఈ సినిమా అవుట్‌పుట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
కథానాయకి మాళవిక మోహన్ కూడా శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న తమ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.


