
సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ లో హిందూపురం శాసనసభ్యులు, కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ గ్రహీత, బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పై అనుచిత, నిరాధార ఆరోపణలు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ గురువారం ప్రకాశం జిల్లా ఎన్.బి.కె ఫ్యాన్స్ తరపున ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో అభిమానులు ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీకి మద్యం తాగి వస్తారని అర్థం చేస్తూ అవమానకరంగా మాట్లాడడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. గౌరవ శాసనసభను, అగౌరవ పరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వారు అన్నారు. సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ గౌరవానికి భంగం కలిగించేలా అభిమాన మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం పై వారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ కృష్ణ గారికి రాతపూర్వకంగా
ఫిర్యాదు చేశారు. వెంటనే సోహెల్ అహ్మద్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే తన ఇంస్టాగ్రామ్ ను, తన పేరున గల ఇతర సామాజిక మాధ్యమాలను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు సిఐ ను కోరారు. ప్రకాశం జిల్లా ఎన్ బి కె ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి వాసు, ఒంగోలు నగర ఎన్ బి కె ఫ్యాన్స్ అధ్యక్షుడు
కాట్రగడ్డ వంశీ, ఫిర్యాదు చేశారు. వారి వెంట ఎన్ బి కె ఫ్యాన్స్ హనీఫ్ ఖాన్,
కొమ్మాలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ, యమల బాల కృష్ణ, బెజవాడ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.


