మార్చి 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘హే బ‌ల్వంత్‌’

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో సూప‌ర్‌హిట్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ సినిమాయే ‘హే బ‌ల్‌వంత్‌’. ఈ కామెడీ డ్రామా మార్చి 31 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. గోపి ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు ఈ చిత్రానికి కో రైట‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు. సుహాస్‌, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో వి.కె.న‌రేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు. త్రిశూల్ విజ‌న‌రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై బి.న‌రేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు.

https://www.instagram.com/p/DWYMS3CEdoV
గుంటూరు నేప‌థ్యంలో ‘హే బ‌ల్వంత్‌’ సినిమాను రూపొందించారు. యువ‌కుడైన కృష్ణ‌(సుహాస్‌)కు తండ్రి వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నే ఆస‌క్తి ఉంటుంది. అయితే త‌న తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియ‌టంతో త‌ను షాక‌వుతాడు. అదే స‌మ‌యంలో మిత్ర‌(శివానీ  నాగ‌రం)తో ప్రేమ‌లో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను న‌డుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేస్సే బిజినెస్ విషయం తెలిస్తే ఏమ‌వుతుంద‌నే ఆలోచ‌న‌ల‌ మధ్య కృష్ణ‌ ఇరుక్కుపోతాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మ‌ధ్య అనుబంధం, అస‌లేం జ‌రిగింద‌నే నిజానిజాలు, చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు అనేదే అస‌లు క‌థాంశంగా సినిమా రూపొందింది.

ఈ సంద‌ర్భంగా సుహాస్ మాట్లాడుతూ ‘‘సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది ఆశయాలు, కుటుంబం, మనం ఎక్కువగా పట్టించుకోని నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది. సినిమాలో మంచి కామెడీ ఉంది. అలాగే హృద‌యాన్నిహ‌త్తుకునే భావోద్వేగం ఉంది. నిజాయ‌తీతో చేసిన ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు జీ5 ద్వారా ప్రేక్షకుల దగ్గరకు చేరుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మ‌రింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది’’ అన్నారు.

సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్ మాట్లాడుతూ హే బల్వంత్ సినిమాలో తండ్రీ కొడుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఇందులో బల్వంత్ పాత్ర చేయ‌టం సాధార‌ణ విష‌యం కాదు. న‌టుడిగా నాలో భిన్న‌మైన కోణాన్ని ఆవిష్క‌రించిన సినిమా ఇది. వైవిధ్య‌మైన‌, అర్థవంతమైన తెలుగు కథలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే జీ5లో ఈ సినిమా విడుదలవడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

 ‘బ‌ల్వంత్’ సినిమాను మార్చి 31న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో వీక్షించండి.

Related Articles

Latest Articles