సల్మాన్ ఖాన్ సరసన నయనతార – భారీ యాక్షన్ డ్రామాగా రానున్న #SVC63

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత-దర్శకుడు వంశీ పైడిపల్లి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)ల భారీ క్రేజీ కాంబినేషన్లో ‘#SVC63’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి అనౌన్స్‌మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ, ఈ మెగా యాక్షన్ డ్రామాలో సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన నయనతార రాకతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను ఎంతో బలంగా తీర్చిదిద్దుతారు. ఈ సినిమాలో కూడా ఫీమేల్ లీడ్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా నయనతార లాంటి అద్భుతమైన నటిని ఎంపిక చేశారు. తొలిసారిగా తెరపై కనిపించనున్న సల్మాన్, నయనతారల జోడీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


భారీ స్టార్ కాస్ట్, కథాబలం మరియు హై-ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో సిల్వర్ స్క్రీన్ స్పెక్టాకల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.
చిత్ర బృందం వివరాలు:

  • నటీనటులు: సల్మాన్ ఖాన్, నయనతార
  • రచన, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
  • నిర్మాత: దిల్ రాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  • పీఆర్ఓ: వంశీ-శేఖర్

Related Articles

Latest Articles