
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.
హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా తెలుగు టీజర్‌ను లాంచ్ చేశారు.
“ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది… మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు” అనే వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ క్రేజీగా ఆకట్టుకుంది.
“లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉంది… ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది” అనే డైలాగ్‌తో ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీ, కృతి శెట్టిని వర్షంలో కలిసే సన్నివేశం—ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. ఎస్.జె. సూర్య ఎంట్రీ టీజర్‌కు మరో హైలెట్‌గా నిలిచింది. “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అని ఆయన చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.
దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ క్రేజీ లవ్ స్టోరీని ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేయడం, వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా అనిపించింది.
అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవి వర్మన్ కెమెరా వర్క్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. మొత్తంగా టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఎస్ జె సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రహ్, మాళవిక
రచన & దర్శకత్వం: విఘ్నేష్ శివన్
నిర్మాత – నయనతార
నిర్మాత & సమర్పణ – SS లలిత్ కుమార్
సహ నిర్మాత – L.K. విష్ణు కుమార్
తెలుగు రిలీజ్: శ్రీ పద్మిని సినిమాస్
సంగీతం – అనిరుధ్ రవిచందర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – రవి వర్మన్ ASC ISC
ప్రొడక్షన్ డిజైన్ – టి ముత్తురాజ్
ఎడిటర్ – ప్రదీప్ ఇ రాఘవ
పీఅర్వో: వంశీ శేఖర్


