‘రాకాస’ చిత్ర రివ్యూ

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై జి స్టూడియోస్ తో కలిసి నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలుగా మానస శర్మ రచనా దర్శకత్వంలో హారర్ కామెడీ జోనర్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాకాస. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ చేయగా రమేష్ మన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించినగా గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
అమెరికా నుండి తన ప్రేయసి కోసం తిరిగి వచ్చిన యువకుడు ఆ ఊరిలోని ఆచార కట్టుబాటులకు విరుద్ధంగా చేసిన కొన్ని పనుల వల్ల కొన్ని ఇబ్బందులు పడతాడు. అతనికి తన స్నేహితులు సహాయం చేస్తూ ఉండగా ఊరికి ఉన్న ఒక శాపం వల్ల అతడు ఆ గుడి ప్రజల అమాయకత్వం నుండి బయటకు తీసుకురావాలనుకుంటూ చేసే ప్రయత్నంలో అతని ఇరుక్కుపోతాడు. అయితే ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? ఆ శాపం నుండి అతను బయటపడతాడా లేదా? బయటపడేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఏంటి? అతనికి తన స్నేహితులు ఎంతవరకు అండగా నిలబడతారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు నటన :
సంగీత్ శోభన్(వీరబాబు) కథానాయకుడిగా గత చిత్రాలలో ప్రేక్షకులు ఎక్కువగా చూసినది కామెడీ జోనర్లోనే. అయితే సరికొత్త హారర్, కామెడీ జోనల్లో తనను మొదటిసారి ప్రేక్షకులు చూడటం సరికొత్తగా ఉంటుంది. అలాగే తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ఇంకా నటనతో సంగీత్ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. నయన్ సారిక (సుబ్బలక్ష్మి) ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. కేవలం కళ్ళతోనే నటించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఆమె కళ్ళతో నటించిన నటన తీరు యువత మనసులో చెరగని ముద్ర వేసుకునే విధంగా ఉంది. అటు అమాయకత్వంతో పాటు ఇటు పర్ఫామెన్స్ లో కూడా చాలా బాగా నటించారు. గెటప్ శీను, వెన్నెల కిషోర్ సినిమాలో పర్ఫెక్ట్ డైలాగ్ తో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి తదితరులు తమ పాత్రకు తగ్గట్లు నటిస్తూ సినిమాకు మరింత బోనస్ గా నిలిచారు. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
తాను రాసుకున్న ఒక చందమామ కథను నేటి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా వెండితెరపై చూపించడంలో దర్శకురాలు విజయం సాధించారు. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఇటువంటి విఎఫ్ఎక్స్ చాలా అరుదైనది. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినప్పటికీ సినిమా ఓవడాలుగా ఎంత అద్భుతంగా వచ్చింది. BGM, పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, విఎఫ్ఎక్స్

మైనస్ పాయింట్స్ :
కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం

సారాంశం :
ఎటువంటి లేకుండా కుటుంబ సమేతంగా థియేటర్లలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే చిత్రం రాకాస.

Related Articles

Latest Articles