
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మాణంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘#DhurandharTheRevenge’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా తన మూడవ వారాంతం ముగిసేసరికి ఇండియాలో ₹1,000 కోట్ల (నెట్) మైలురాయిని దాటి, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ₹1,622 కోట్ల గ్రాస్ వసూలు చేసి గ్లోబల్ స్థాయికి భారతీయ సినిమా సత్తాను చాటింది.
మొదటి రెండు వారాల్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, మూడవ వారాంతంలో కూడా ప్రేక్షకులను భారీగా థియేటర్లకు రప్పించి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
కలెక్షన్ల వివరాలు (18 రోజులకు):
- మొదటి వారం (8 రోజులు): ₹690 కోట్లు
- రెండవ వారం: ₹271 కోట్లు
- మూడవ వారాంతం: ₹80 కోట్లు (శుక్రవారం ₹23 కోట్లు, శనివారం ₹27 కోట్లు, ఆదివారం ₹30 కోట్లు)
- ఇండియా నెట్ కలెక్షన్స్ (India NBOC): ₹1,041 కోట్లు
- ఇండియా గ్రాస్ (India GBOC): ₹1,228 కోట్లు
- ఓవర్సీస్ కలెక్షన్స్: ₹394 కోట్లు
- ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు (Worldwide Gross): ₹1,622 కోట్లు
చిత్రం సృష్టించిన సరికొత్త రికార్డులు: - ఇండియాలో అత్యంత వేగంగా 100 కోట్ల నుంచి ₹1000 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాళ్లను చేరుకున్న చిత్రం.
- నార్త్ అమెరికాలో $25 మిలియన్లు, జర్మనీలో €1 మిలియన్ మార్కును దాటిన మొట్టమొదటి భారతీయ సినిమా.
- అత్యధిక ఓపెనింగ్స్, ఫస్ట్ వీక్ మరియు సెకండ్ వీక్ కలెక్షన్లు సాధించిన సినిమా.
- కేవలం 10 రోజుల్లోనే ‘ధురంధర్ పార్ట్ 1’ జీవితకాల ఓవర్సీస్ కలెక్షన్లను అధిగమించింది.
- నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.


