
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ యూట్యూబ్, సోషల్ మీడియాలలో సంచలనం సృష్టిస్తోంది.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం అందించిన ఈ పాట.. తాజాగా 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నాని కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకోవడమే కాకుండా, సినిమా రిలీజ్‌కు ముందే 100 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను దాటిన ఆయన తొలి పాటగా ‘ఆయా షేర్’ చరిత్రకెక్కింది.
ఈ పాట ఇంతలా వైరల్ కావడానికి నాని ఎనర్జిటిక్ డ్యాన్స్, ఆయన మాస్ యాటిట్యూడ్, హుక్ స్టెప్ ప్రధాన కారణాలు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ డ్యాన్స్ కవర్స్‌తో ఇంటర్నెట్ను ఈ పాట షేక్ చేస్తోంది. దీనికి తోడు, ఈ సాంగ్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా వేసిన భారీ స్లమ్ సెట్ విజువల్స్ పట్ల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
‘ఆయా షేర్’ సాధించిన గ్లోబల్ రీచ్తో ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


