‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ ప్రభంజనం – ప్రపంచవ్యాప్తంగా ₹1,680 కోట్ల కలెక్షన్లు

జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన, ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘#DhurandharTheRevenge’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారతదేశంలో ₹1,000 కోట్ల (నెట్) వసూళ్ల మైలురాయిని దాటిన మొట్టమొదటి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా, తన బ్లాక్ బస్టర్ జోరును కొనసాగిస్తూ మూడు వారాలు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹1,680 కోట్ల గ్రాస్ సాధించింది.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వీక్ డేస్ లోనూ స్థిరమైన కలెక్షన్లు రాబడుతూ, రిపీట్ ఆడియన్స్‌తో థియేటర్లలో సందడి చేస్తూ ఇప్పుడు విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద గ్లోబల్ హిట్లలో ఒకటిగా ఈ చిత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు (మూడు వారాలకు):

  • భారతదేశంలో నెట్ వసూళ్లు (NBOC): ₹1,081 కోట్లు
    (1వ వారం: ₹690 కోట్లు | 2వ వారం: ₹271 కోట్లు | 3వ వారం: ₹120 కోట్లు)
  • భారతదేశంలో గ్రాస్ వసూళ్లు (GBOC): ₹1,276 కోట్లు
  • ఓవర్సీస్ గ్రాస్: ₹404 కోట్లు
  • ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు: ₹1,680 కోట్లు

Related Articles

Latest Articles