ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు క్రాస్ చేసిన అడివి శేష్ ‘డెకాయిట్’

అడివి శేష్ హీరోగా, షానియల్ డియో దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారం అద్భుతమైన వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, రెండో వారంలోకి అడుగుపెట్టినా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది.

కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఎనిమిదో రోజు ఒక్కటే ‘బుక్ మై షో’లో 20 వేలకు పైగా (20.31K+) టికెట్లు అమ్ముడవడమే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనం.

విదేశాల్లో కూడా డెకాయిట్ అదరగొడుతోంది. అమెరికాలో (USA) ఇప్పటికే $1.3 మిలియన్ల వసూళ్లను సాధించి, $1.5 మిలియన్ల వైపు అడుగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాలకు సంబంధించిన టికెట్ ప్రీ-సేల్స్ భారీగా పెరిగాయి. ఈ వారం ప్రేక్షకులకు మొదటి ఛాయిస్‌గా ‘డెకాయిట్’ నిలవడంతో, సెకండ్ వీకెండ్ వసూళ్లు మరింత భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తం మీద ‘డెకాయిట్’ సినిమా అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Related Articles

Latest Articles