రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో వాడే ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. ఈ రోజుల్లో కల్తీ లేని ఆహార పదార్థాలు దొరకడం కష్టం ఐపోయింది. ఇలాంటి సమయంలో అశ్య ఫుడ్స్ వారు స్వచ్ఛమైన కల్తీ లేని ఆహార పదార్థాలను మన ముందుకు తీసుకొస్తున్నారు. కల్తీలేని ఆహారాన్ని అందించాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే అశ్య ఫుడ్స్. ఫౌండర్ శశిధర్ రెడ్డి కూతురు అశ్య పేరుమీద ఈ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా ఆరు ప్రొడక్ట్స్ ని మాత్రమే పరిచయం చేస్తున్నారు. త్వరలో మరొక 22 ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తారని తెలుస్తోంది.

నటుడు, రియల్ హీరో సోనుసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అశ్య ఫుడ్స్ ప్రొడక్ట్స్ ను ఫౌండర్ శశిధర్ రెడ్డి, కో-పౌండర్ హర్షిత వెలివాల మార్కెట్ కు పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా కారంపొడి, ఉప్పు, పసుపు, మిరియాలు, జిలకర, కిన్వా ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. Dice art films వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ సోనుసూద్, ఐఏఎస్ భవాని శ్రీ, డాక్టర్ గురువారెడ్డి, Dr నాజర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, రాజ్యసభ మెంబర్ వద్దిరాజు రవిచంద్ర, ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది, రోబోటిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, హై కోర్టు జడ్జ్ విజయ్ సేన్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే మూట గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో తయారయ్యే స్వచ్ఛమైన, ఘాటైన కారంపొడిని అశ్య ఫుడ్స్ వారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గురువారెడ్డి కారంపొడి ప్రోడక్ట్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తాను గుంటూరు వాసుడని గుర్తు చేశారు. డా. గురువారెడ్డి మాట్లాడుతూ… ఫౌండర్ శిశిధర్ రెడ్డి ఫ్యామిలీ లాంటివాడు అని పేర్కొన్నారు. మార్కెట్ అంతా కలుషితం అవుతున్న ఈ సమయంలో 6 ప్రోడక్ట్ లను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా కిన్వా మనకు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. కిన్వాలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు కొంతమందికి తెలిసిన కిన్వా ఇకపై అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీ కి సోనూ సూద్ మాత్రమే సరైనవాడు అని తెలిపారు. ఈ సందర్బంగా ఫౌండర్ శశిధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ భవాని శ్రీ మాట్లాడుతూ.. గత సంత్సరం నుంచి అశ్య ఫుడ్ టీమ్ చాలా కష్టపడుతున్నారు. మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్ అందించాలని ఫౌండర్ శశిధర్ రెడ్డి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈరోజు మొదలైన ఈ ప్రయాణం చాలా సుదీర్ఘంగా సాగాలని కోరుతున్నట్లు చెప్పారు. రుచికరమైన ఆహార పదార్థలను కస్టమర్లకు అందించాలిన్నారు. జాతీయ పసుపు సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ భవాని శ్రీ, సోనుసూద్ తో కలిసి పసుపు ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. దేశంలోనే అత్యంత మన్నికైన పసుపుకు పేరుగాంచిన స్థలం మేఘాలయ లోని లకడాంగ్ అని, అశ్య ఫుడ్స్ వారు అక్కడి నుంచి పసుపు తీసుకురావడం అద్భుతం అని పేర్కొన్నారు.

కంపెనీ బ్రాండంబాసిడర్ సోనూ సూద్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫౌండర్ శశిధర్ రెడ్డి, హర్షిత ఫ్యామిలీ లాంటి వారు. వారు అశ్య ఫుడ్స్ కంపెనీ గురించి చెప్పి లాంచ్ చేయాలి అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. వీరు చాలా కాలంగా తెలుసు ఇలాంటి వారు ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు అంటే ఎంత క్వాలిటీ గా ఉంటుందో నాకు తెలుసు అందుకే అడగ్గానే ఒప్పుకున్నాను అన్నారు. ఈ ప్రొడక్ట్స్ ప్రతి కిచెన్ లో ఉండాల్సిందే. ఇవి లేకుండా మనం ఆహారం తినలేము అన్నారు. వారు అడగగానే కాదనలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే తెలుగు వారు కావడం. ఇది తెలుగు గడ్డ ఎప్పుడు నాది అనిపిస్తుంది. అందుకే తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రిఫెరెన్సు ఇస్తుంటా అని పేర్కొన్నారు. ఇక కోవిడ్ పరిస్థితిల గురించి గుర్తు చేశారు. ఈ కంపెనీకి బ్రాండ్అంబాసీడర్ గా చెబుతున్న ఈ ప్రొడక్ట్స్ ఉన్న కిచెన్ బెస్ట్ కిచన్ అని అన్నారు.

బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలితరం వ్యాపారవేత్తలు ముందుకు రావాలి అనే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫౌండర్ శశిధర్ రెడ్డిని అభినందించారు. తెలంగాణలో బిజినెస్ మెన్స్, తెలంగాణ సంస్కృతి గురించి వారి ఫ్రెండ్స్, పొలిటికల్ సర్కిల్ లో మాట్లాడుకుంటామని పేర్కొన్నారు. మొదటినుంచి మనది వ్యాపారం చేసే సంస్కృతి కాదని అందుకే తెలంగాణలో ఎక్కువగా వ్యాపారవేత్తలు లేరని అన్నారు. ఇకనుంచి కొత్తతరం వ్యాపారవేత్తలు పుట్టుకు రావాలని ఆకాంక్షిస్తూ ఆశ్య ఫుడ్స్ ఫౌండర్ శశిధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అశ్య ఫుడ్స్ అదాని సూపర్ ఫుడ్స్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్గనిక్ ప్రోడక్ట్ తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సాహసం చేసిన శశిధర్ కి థాంక్స్ చెప్పారు. ఈ ప్రొడక్ట్స్ కు సోనుసూద్ అంబాసిడర్ గా ఉండటం గ్రేట్ అని అభివర్ణించారు. సోను బాయ్ వలన ఈ ప్రొడక్ట్స్ ఇంకా ఎక్కువ ఆదరణ పొందుతాయని పేర్కొన్నారు. కల్తీ లేని ఆహార పదార్థాలను అందించాలని ఆలోచన రావడం గొప్ప విషయమని అన్నారు.

కజకిస్తాన్ గౌరవ కౌన్సిల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, మాట్లాడుతూ.. ఈరోజుల్లో ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని తీసుకురావడం, దీనికి సోనుసూద్ లాంటి వ్యక్తిని అంబాసిడర్ గా నియమించడం అద్భుతం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో సోను సూట్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కంపెనీ నుంచి భవిష్యత్తులో మరిన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ రావాలని ఆశించారు. అందుకోసం తన వంతు సాయం అందిస్తారని పేర్కొన్నారు. కల్తీ లేని ప్రొడక్ట్స్ ని అందించడానికి గట్స్ కావాలి అది శశిధర్ రెడ్డికి ఉందన్నారు. ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చిన సోను సూద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రొడక్ట్స్ మంచి ఆదరణ పొందుతాయని ఆకాంక్షించారు.

Related Articles

Latest Articles