
హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న “ఫస్ట్ టైం” సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న ముఖ్యఅతిథిగా విచ్చేసిన అగ్ర నటి అందాల తార పాయల్ రాజ్ పుత్ చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్, విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు హేమంత్ ఇప్పలపల్లి. AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా HI( హ్యూమన్ ఇంటలిజెన్స్) తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈవెంట్ కి అతిథులుగా సీనియర్ నిర్మాత దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి గారు, బిజెపి స్పోక్స్ పర్సన్ ప్రభ గౌడ్ గారు, జి చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ గారూ, హీరో అభినవ్ శౌర్య విచ్చేయగా ముఖ్యఅతిథిగా అందాల తార పాయల్ రాజ్ పుత్ విచ్చేశారు.
దేవగుడి చిత్ర నటుడు ‘అభినవ్ శౌర్య’ మాట్లాడుతూ : అందరికీ నమస్కారం. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిత్ర బంధానికి నా ధన్యవాదాలు. నేను పాయల్ రాజ్పుత్ గారికి వీరాభిమానిని. చిత్ర ట్రైలర్ చాలా బాగుంది, హాలీవుడ్ స్థాయిలో ఉంది. రాజమౌళి గారిని అభిమానించే మీ చిత్రాలు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
బిజెపి స్పోక్స్ పర్సన్ ‘ప్రభ గౌడ్ గారు’ మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూసిన వెంటనే నాకు మన సంస్కృతి, మన మూలాలు, మన ధర్మం గుర్తొచ్చాయి. మన మట్టికి సంబంధించిన మూలాలను ఈ సినిమాకి అటాచ్ చేసినట్లు అర్థమవుతుంది. నేటి తరం యువతకు ఒక అర్థమంతమైన చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుందని, సినిమా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.
జీ చీఫ్ ఎడిటర్ ‘భరత్ కుమార్ గారు’ మాట్లాడుతూ : అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం_ చిత్ర ట్రైలర్ లాంచ్ కు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్ర కథను ముందుగా విన్నది నేనే. దర్శకుడు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమా చేయడం ఎంత కష్టమో చూసాను. చాలా తక్కువలో గ్రాఫిక్స్ పూర్తి చేశారు. సనాతన ధర్మం గురించి వివరించే చిత్రం ఫస్ట్ టైం. కొత్త వారితో చాలా మంచి సినిమా తీశారు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ ” అన్నారు.
నటి ‘గాయత్రి గుప్తా’ మాట్లాడుతూ : దర్శకులు నన్ను ఆడిషన్ కూడా చేయకుండా తీసుకున్నారు. తొలి దర్శకులు అన్నప్పుడు సాధారణంగా నమ్మకం ఉండదు కాని ఆయన విషన్ వేరు. ఆయనతో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నిలబడే వ్యక్తిని కాబట్టి నాకు ఈ సినిమా మరింత బాగా కనెక్ట్ అయింది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో ‘సౌరబ్ ధింగ్ర’ మాట్లాడుతూ : అందరికి నమస్కారం. ఈ రోజు మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఈ స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్ రాజ్పుత్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తి చేయడానికి హేమంత్ గారు చాలా కష్టపడ్డారు. విఎఫ్ఎక్స్ కోసం చాలా కృషి చేశారు. చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
సీనియర్ దర్శక నిర్మాత’బెల్లం రామక్రిష్ణ రెడ్డి గారు’ మాట్లాడుతూ : ఫస్ట్ టైం చిత్రాన్ని దర్శకత్వం చేసిన ఫస్ట్ టైం డైరెక్టర్ హేమంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. ఈ సినిమా కోసం తన ఆస్తులు కూడా అమ్ముకొని ఈ చిత్రం పూర్తి చేసినట్లు తెలిసింది. సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత ‘హేమంత్ ఇప్పలపల్లి’ గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా నమస్కారం. నేను గురువుగా భావించే వ్యక్తి రాజమౌళి గారు. ఆయన దగ్గర పని చేయనప్పటికీ ఆయన సినిమాలు నాకు ప్రేరణగా నిలిచి నేను ఈ సినిమా తీసేందుకు తోడ్పడ్డాయి. ఆయన మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాము. ఈ సినిమా కోసం సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అనుకుంటున్నాను. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
ముఖ్య అతిథి నటి ‘పాయల్ రాజ్ పుత్’ మాట్లాడుతూ : అందరికి నమస్కారం. కొంతకాలం గ్యాప్ తర్వాత మీ అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని తమిళ పంజాబీ చిత్రాల వల్ల నేను హైదరాబాద్ కు రాలేకపోతున్నాను. తెలుగు మీడియా వారిని మరోసారి ఇలా కలవడం చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర దర్శక నిర్మాత హేమంత్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం సినిమా చాలా మారిపోయింది. గత రోజులతో పోలిస్తే ఇప్పుడు కథలు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఎంతో కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చూస్తే షాకింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి హీరోయిన్ రాలేకపోయారు. వేరే చిత్ర షూటింగ్ వల్ల బిజీగా ఉన్న ఆమె తర్వాత ఈవెంట్స్ లో కచ్చితంగా ఉంటారు. తెలుగు ప్రేక్షకులు టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో ఎప్పుడు ముందుంటారు. అదేవిధంగా ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా శౌరబ్ ను చూస్తున్నాను. అతని డేడికేషన్ నాకు తెలుసు, ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డారు. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా షౌరబ్ ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందం వారికి ఆల్ ద బెస్ట్. మే 22న ఈ చిత్ర విడుదల కోసం నేను ఎదురు చూస్తున్నాను” అన్నారు.
నటీనటులు :
సౌరబ్ ధింగ్ర హీరోగా, అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం :
రచయిత ఎడిటర్ విఎఫ్ఎక్స్ లీడ్ నిర్మాత మరియు దర్శకుడు : హేమంత్ ఇప్పలపల్లి
సంగీతం : శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్ మరియు రామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. రాజశేఖర్
పి ఆర్ ఓ : ఎస్ నాగేశ్వరరావు (ఎస్ ఎన్ ఆర్)
మార్కెటింగ్ పార్టనర్ : పుష్యమి మీడియా
పబ్లిసిటీ డిజైనర్ : వెంకట్ మజ్జి


