జీ5లో త్వ‌ర‌లో స్ట్రీమింగ్‌ కానున్న ‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 ఇప్పుడు మ‌రో కొత్త సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అదే ‘‘మేము ‘కాప్‌’లం’’. కామెడీ, మిస్టరీ కలయికగా రూపొందిన ఈ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం..ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. తాజాగా సిరీస్ టైటిల్‌ను మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో గెటప్ శ్రీను, జాఫర్ కనిపించారు. ఆ వీడియో అన్నీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి రూపొందుతున్న “మేము కాప్’లం” సిరీస్‌కు ‘విక‌ట‌క‌వి’ డైరెక్ట‌ర్‌ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌కి శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. ఇందులో నాగ‌బాబు కొణిదెల ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. గెట‌ప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చ‌క్క‌టి న‌ట‌న‌, కామెడీ టైమింగ్‌తో వీరు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడ ఒక విచిత్రమైన ఘటన జరగడంతో గ్రామంలో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంది. ఆ కేసును విచారించడానికి ఇద్దరు పోలీసుల ద్వ‌యం రంగంలోకి దిగుతారు. వారికి ఇదే ఫస్ట్ బిగ్ కేస్ అవుతుంది. ఆ ఇద్దరూ ఎంతో కాన్ఫిడెంట్‌గానే ఉంటారు కానీ కాస్త టెన్షన్‌గా ఫీల్ అవుతుంటారు. అక్కడ వారికి దొరికే క్లూస్, ఆ తరువాత జరిగే పరిణామాలు అన్నీ కూడా వినోదాత్మకంగా మారుతాయి. ప్రతీ ఒక్కరిపై అనుమానం రావడంతో అంతా గందరగోళంగా మారుతుంది. చిన్న ఘటనతో అక్కడి వాతావరణం అంతా మారిపోతుంది. అవేంట‌నేవి తెలుసుకోవాలంటే మాత్రం సిరీస్ చూడాల్సిందే.

లోక‌ల్ ఫ్లేవ‌ర్‌తోబ‌ల‌మైన‌ పాత్రల చుట్టూ తిరిగే కథనం, వ్యంగ్యమైన క‌నిపించే క‌థా పాత్ర‌ల‌తో “మేము కాప్’లం” తెలుగు ZEE5 ఒరిజినల్స్‌లో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే వెబ్ సిరీస్‌గా క‌నిపించ‌నుంది. మ‌నం ఎప్పుడూ చూసే, మ‌న‌ల్ని ప్రతిబింబించే కథలను ఆధునిక మేళవింపుతో చూపించే జీ5 ప్రాజెక్ట్‌ల జాబితాలో ఇది ఒక‌టిగా మార‌నుంది.

ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు కొణిదెల మాట్లాడుతూ ‘‘‘పరువు’ తర్వాత జీ5లో నేను చేస్తోన్న సిరీస్ ‘‘మేము కాప్’లం’’. కథా నేపథ్యం, పాత్రలు, ఆసక్తికరమైన కథనం వల్ల నాకు బాగా నచ్చింది. ఈ టీమ్‌తో పని చేయడం చాలా సంతృప్తికరంగా అనిపించింది. హాస్యాన్ని, అర్థవంతమైన స్థానిక కథలను బ్యాలెన్స్ చేసే ఈ సిరీస్‌లో భాగం కావటం నాకు సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది” అన్నారు.

‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్ అప్ డేట్స్ కోసం జీ5ను ట్యూన్ చేయండి.

జీ5 గురించి…

భారతదేశపు అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా, లక్షలాది వినోద ప్రియులకు హాట్ ఫేవరేట్‌గా జీ5 దూసుకుపోతోంది. జీ5 గ్లోబల్ కంటెంట్ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) సంస్థ నుండి వచ్చింది. వినియోగదారులకు తిరుగులేని వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫామ్‌గా ఇది 4,071కి పైగా సినిమాలు, 1,800కి పైగా టీవీ షోలు, 422కి పైగా వెబ్ ఒరిజినల్స్, 4,492కి పైగా మ్యూజిక్ వీడియోలు, 1.35 లక్షల గంటలకు పైగా ఆన్-డిమాండ్ కంటెంట్‌తో కూడిన విస్తృతమైన, విభిన్నమైన ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది. విస్తరించి ఉన్న 7 పర్సనలైజ్డ్, హైపర్-లోకల్ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లతో ఈ కంటెంట్ ఇప్పుడు మా విభిన్న ప్రేక్షకులకు 12 భాషలలో – హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీలో అందుబాటులో ఉంది. ఇందులో మా విస్తృతమైన ఒరిజినల్స్, భారతీయ, అంతర్జాతీయ సినిమాలు, టీవీ షోలు, పిల్లల షోలు, వార్తలు, లైవ్ టీవీ వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్త టెక్ దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏర్పడిన బలమైన డీప్-టెక్ స్టాక్, ZEE5కు బహుళ పరికరాలు, ఎకోసిస్టమ్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో నిరంతరాయమైన అనుభవాన్ని అందించడానికి వీలు కల్పిస్తుంది. Facebook, Instagram, LinkedIn, Xలో ZEE5ను ఫాలో అవుతూ మరిన్ని అప్డేట్లను పొందండి.

Related Articles

Latest Articles