

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్స్ & నటీనటులు వివాహం చేసుకోవడం, యాంకర్స్ & దర్శకులు వివాహం చేసుకోవడం మనం చూస్తూనే వచ్చాము. ఇప్పుడు అదే తరహాలో ప్రముఖ సినీ యాంకర్స్ పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూట్యూబ్ యాంకర్ గా, ఆర్టిస్ట్ గా రానిస్తున్న యాంకర్ చందు (కొల్లు చంద్రకాంత్) అదే యాంకర్స్ కుటుంబానికి చెందిన యాంకర్ & ఆర్ జె అంజలితో వివాహం జరిగింది. ఈ వివాహానికి యాంకర్ సుమ గారు, రాజీవ్ కనకాల గారు జంటగా వచ్చి ఈ నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అలాగే యాంకర్ స్రవంతి, అలాగే నటి సత్య కృష్ణ, రాకేష్ వర్రె, దివి, అంబటి అర్జున్, కిల్లి క్రాంతి కుమార్, జోర్డాన్ సుజాత, రాకేష్, దర్శకుడు ఆనంద్ రవి, కిషోర్, సినీ జర్నలిస్టులు, యాంకర్స్ తదితరులు వారి వివాహానికి హాజరై ఈ వేడుకను పండగ వాతావరణంగా మార్చారు.


