
ప్రముఖ చలనచిత్ర పంపిణీదారులు శ్రీ పి. భరత్ భూషణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్గా నియమించినందుకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హర్షం వ్యక్తం చేస్తోంది.
శ్రీ భరత్ భూషణ్ గారు ప్రముఖ పంపిణీదారులుగా, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులుగా తమ పదవీ కాలంలో ఎంతో నిబద్ధతతో, నిష్కళంకమైన సేవలను అందించారు. అలాగే, ప్రస్తుతం వారు భారత ప్రభుత్వం గుర్తించిన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’కు వైస్-ప్రెసిడెంట్గా కొనసాగుతూ భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
శ్రీ భరత్ భూషణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాలతో సత్ సంబంధాలు కలిగి ఉన్నందున తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహద పడుతుంది.
ఈ సందర్భంగా, శ్రీ పి. భరత్ భూషణ్ గారిని ఏపీ ఎఫ్.డి.సి (AP FDC) చైర్మన్గా నామినేట్ చేసినందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులైన పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి మరియు ప్రముఖ సినిమా హీరో, గౌరవ ఎం. ఎల్. ఏ. చైర్మన్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ కాన్సర్ ఇన్స్టిట్యూట్, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరి సమర్థవంతమైన పరిపాలన మరియు దార్శనికతతో ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాము.


