
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం “దూరదర్శిని”. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మురళి మోహన్ రెడ్డి, సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ చేయగా తిరుపతి ఎడిటింగ్ చేశారు. ఆనంద్ గుర్రాన సంగీతాన్ని అందించారు. భద్రం, బాలరాజు, జెమిని గణేష్, లావణ్య రెడ్డి, తేజ విహాన్, పాండు, భాస్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాగా నేటి నుంచి ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి వచ్చిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఓ చక్కటి సందేశంతో సమాజ మార్పు కోసం వచ్చిన కథగా చెప్పుకోవచ్చు. ఒక గ్రామానికి చెందిన రెండు వేరు వేరు కులాలలో పుట్టిన ఇతరు ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ గ్రామంలో కుల బేధాలు రావడంతో ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య వచ్చే సమస్యలను అసలు ఎలా తీరతాయి? సమస్యలు తీరి వారి ప్రేమ గెలుస్తుందా లేదా సమస్యల వల్ల వారి ప్రేమ ఫెయిల్ అవుతుందా? ఆ గ్రామంలో కుల సమస్య ముగుస్తుందా లేదా కొనసాగుతుందా? ఆ సమస్య వల్ల ఎవరు నష్టపోయారు? ఎవరు లావు పడ్డారు? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటులు నటన :
తొలి చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో సువిక్షిత్ తనదైన శైలిలో చాలా న్యాచురల్ గా హీరోగా నటించారు. ఒక పల్లెటూరి యువకుడిలా దూరదర్శిని కాలంనాటి రూపంలో చాలా బాగా సూట్ అయ్యారు. అలాగే గీతికా రతన్ అదే కాలంలో పల్లెటూరి అమ్మాయిల చాలా న్యాచురల్ గా పెర్ఫార్మన్స్ ఇచ్చి తన పాత్ర పరిధిలో అద్భుతంగా నటించారు. యదార్థ సంఘటన కావడంతో నటీనటులు అందరూ కొత్తవారైతే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువమంది కొత్త నటీనటులతో ఈ సినిమా చాలా బాగుంది. భద్రం, బాలరాజు, జెమిని గణేష్, లావణ్య రెడ్డి తదితరులు తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
యదార్థ సంఘటన కావడంతో ఈ కథ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా రాసుకోవడంలో అలాగే వెండితెరపై చూపించడంలో దర్శకుడు కార్తికేయ విజయం సాధించారు. న్యాచురల్ లొకేషన్స్ లో ఎక్కువగా సినిమా ఉండటంతో గ్రామీణ వాతావరణాన్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ సినిమాలోగ్రాఫర్స్ మంచి విజువల్స్ అందించారు. అలాగే కలరింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎక్కడా లోపల లేకుండా చాలా బాగా వచ్చాయి. డబ్బింగ్ సరిగా రాకపోయినప్పటికీ కథ కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు దానిని అంతగా పట్టించుకునే విధంగా లేదు. సినిమాలోని నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.
చిత్ర విశ్లేషణ :
ఊరిని ఊరిగా చూపిస్తూ మొదలైన ఈ కథ మొదటిలో నిదానంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అర్థమవుతూ ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తూ ముందుకు సాగింది. ఎమోషన్ చాలా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. సినిమాకు క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, లొకేషన్స్, నటీనటులు నటన.
మైనస్ పాయింట్స్ :
డబ్బింగ్, కొన్ని నిదానమైన సన్నివేశాలు.
సారాంశం :
ఎక్కడ ఎటువంటి అసభ్యకరమైన పదజాలం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగిన ఒక యదార్థ సంఘటనను సామాజిక స్ఫూర్తితో ఒక గ్రామంలోని మార్పును చూపిస్తూ సందేశాత్మకమైన చిత్రం దూరదర్శని.


