
ప్రముఖ గాయని స్మిత తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన కొత్త సంగీత ప్రాజెక్ట్ “తత్వమసి” గురించి వివరించారు. మరుగున పడిపోయిన తత్వ గీతాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. భక్తి, అద్వైతం, వైరాగ్యం, సామాజిక చైతన్యం వంటి అంశాలతో 100 శనివారాల పాటు ప్రతి వారం ఒక తత్వ గీతాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. తొలి గీతంగా “మానస సంచరరే” విడుదలైందని వెల్లడించారు.


